YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 *నేటీ మంచి మాట*  

 *నేటీ మంచి మాట*  

 
     
 *మహానీయుని మాట*    
" అదృష్టం తనంత తానుగావచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడి, స్వంతం చేసుకోవాలి! అదే అదృష్టం అంటే. "
                                                                                                                                                *జాన్ వాట్సాన్*
 *నేటీ మంచి మాట*  
నిన్ను విమర్శించిన ప్రతివాడు నీ వ్యతిరేకవర్గమే అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. ప్రతి విమర్శలో మూడో కోణం కూడా ఉంటుందని ఆలోచించగలిగితే నువ్వు ఆలోచనాపరుడివి, కార్యశీలివి అవుతావు. 
నేటిమాట
*పశుత్వం నుండి - ఈశ్వరత్వం పొందుట ఎలా???*
'నంది ఈశ్వరుని యొక్క వాహనం'అంటారు,
అయితే ఈశ్వరునికి  మరొక  వాహనం లేకపోయిందా? 
తాను ఈనందినే  ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి? 
కనుక నంది ఈశ్వరుని వాహనం అన్నది తప్పు....
ఈశ్వరత్వానికి లింగం ఎట్టి చిహ్నమో, 
జీవ తత్వానికి నంది అట్టి చిహ్నము. 
అంటే -జీవతత్వంలో ఉండే పశుత్వమే-- ఆ నంది!!!...
పశుత్వంతో ఉన్న ఈ జీవి, తన దృష్టిని  , ప్రకృతి వైపు త్రిప్పక, ఈశ్వరుని వైపు త్రిప్పుటచేతనే,  అది భగవంతుని తో  సన్నిహిత సంబంధము పొందినది...
భగవంతుని పైననే నంది తన దృష్టి ని పెట్టుకుంటుందిగాని, ప్రకృతి పైన పెట్టదు...నందికి, ఈశ్వరునికి , మధ్యలో ఎవరూ అడ్డు రాకూడదు అంటారు. అనగా జీవికి ,దేవునికి మధ్య  ఎవరూ అడ్డు తగలకూడదు అని అర్థం... శ్రవణము ఆధారముగా చేసుకుని ఈ నంది, దైవత్వమును చింతించుటచేతనే..( నంది కర్ణములమధ్యనుండి ఈశ్వరుని చూడాలని అంటారు) .- నంది వేరు, ఈశ్వరుడు వేరు గాకుండా, "నందీశ్వరుడుగా" ఏకమై పోయాడు....
ఈ పశువు ఈశ్వరుని గా మారడానికి  కారణ మేమిటి? ,  
*పశు స్వభావాన్ని విసర్జించి....తన దృష్టి ని ఈశ్వరునిపైమరల్చుటచేత, తాను కూడా  ఈశ్వరుడు గా మారి పోయింది.*
     శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఈ రోజు సందేశం 
నేడు లోకములో మంచి చెబితే వినేవారు లేకపోవచ్చును, మంచికి విలువ లేకపోవచ్చును కానీ మంచివారికి మంచిని ఆశ్రయించేవారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. చెడు ప్రక్క నిలబడి ఎంతోకాలం జీవనం సాగించలేం. చెడును ఆశ్రయించి ఉండుట చేతనే రావణుడు నశించుకు పోయాడు. దుర్బుద్ధి గలవారు అగుట చేతనే నూరు మంది కౌరవులు మట్టిలో కలసిపోయారు. కాలాలు గడిచినా యుగాలు మారినా చరిత్ర పుటలు తిరగేసి చూసినా ఎక్కడ కూడా చెడ్డవాడు బాగుపడినట్టు, మంచివాడు చెడినట్టు కానరాదు. తొలి ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ విజయం మంచికే. గుర్తుంచుకోవలసినది ఏమిటంటే నదీ ప్రవాహంలో కరడు గట్టిన చెక్క మెుద్దులే కొట్టుకుపోతాయి తప్ప మృదువైన పచ్చిక బయళ్లు కాదు.

Related Posts