YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ ప్రాక్టికల్స్ లో చేతి వాటం

ఇంటర్ ప్రాక్టికల్స్ లో చేతి వాటం

ఇంటర్ ప్రాక్టికల్స్ లో చేతి వాటం
గుంటూరు, జనవరి 22, 
ప్రయోగాత్మక విద్యే విద్యార్థి భవితకు పునాది. కొన్నేళ్లుగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా కొనసాగుతూ వచ్చింది. పారదర్శకంగా నిర్వహించేందుకు జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకులాటలో మునిగి తేలుతున్న ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రలోభాల ఎసరు పెట్టి ఈ విధానాన్నీ కలుతం చేస్తున్నాయి. ఎక్కడైతే మాకేంటి అంటూ  ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు ముడుపుల మత్తు చల్లి తమ దారికి తెచ్చుకుంటున్నాయి. దీనికిగాను అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచే దండుకుంటున్నాయి.  ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలలు కూడా ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రాక్టికల్స్‌ గండం తప్పించటానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేస్తున్నారు. ఒక్కో విద్యార్థి చేత రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూల్‌ చేసి ప్రాక్టికల్స్‌ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్‌ కోసం సమయం వెచ్చించే తీరిక లేకపోవటం, నేర్చుకున్నా చేయగలమో లేదోనన్న భయంతో విద్యార్థులు అడిగినంత డబ్బులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు.ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీల అక్రమాలను అడ్డుకోవటానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్‌ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్‌ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలను తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డ వారు తమ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది కూడా నిరి్వగ్నంగా అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం ఈ ఏడాదైనా అవకతవకలను ఆరికట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు  కోరుతునన్నారుసీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 298 కళాశాలల నుంచి ఇంటరీ్మడియట్‌ రెండో ఏడాదికి చెందిన 36,460 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విభాగం నుంచి 29,458, బైపీసీ విభాగం నుంచి 7,002 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, పరికరాలు ఉన్న 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఆర్‌ఐవో తెలిపారు. కర్నూలులో సేమ్ సీన్
ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్‌ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్‌ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జబ్లింగ్‌ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది.జిల్లాలో మొత్తం 299 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 44, ఏపీ మోడల్‌ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్‌ కాలేజీలు10, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు 14,  రెసిడెన్షియల్‌ కాలేజీలు 2, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీలు 3, కో–ఆపరేటివ్‌ కాలేజీలు 1, ఇన్‌సెంటివ్‌ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు 113, ఒకేషనల్‌ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్‌ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్‌  కళాశాలల్లో  ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్‌ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్‌ టూర్‌కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి.అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులను బొటానికల్‌ టూర్‌కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్‌ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్‌ బోర్డు జంబ్లింగ్‌ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి

Related Posts