YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే
సిరిసిల్ల  జనవరి 22  
బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎస్పి  రాహుల్ హెగ్డే సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ప్రత్యేక అధికారి  రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి  ఖీమ్యా నాయక్ సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  డివిజనల్ రెవెన్యూ అధికారి  శ్రీనివాస రావు స్థానిక , తాసిల్దార్ అంజన్న లు సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Posts