YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు

దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు

 దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
సిరిసిల్ల జనవరి 22  (br /> సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దివ్యాంగ ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రత్యేకంగా తీసుకెళ్లేందుకు వాహనాలు, దివ్యాంగులకు సహాయకులతో కూడిన వీల్ చైర్ లు , ర్యాక్ లు , ప్రత్యేక మరుగుదొడ్లు , కుర్చీలు , సహాయక కేంద్రం , ప్రాథమిక వైద్య కేంద్రం వంటి వసతులు ఏర్పాటు చేసారు . ఎన్నికల అధికారులు దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . మున్సిపాల్ ఎన్నికలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం పట్ల దివ్యాంగ ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం , జిల్లా ఎన్నికల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Related Posts