ప్రత్యేకహోదాపై అఖిల సంఘాల సమావేశం ప్రారంభం.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ
హాజరుకానున్న టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఏపీఎన్జీవోలు, ప్రజాసంఘాలు
ప్రభుత్వం తరపున పాల్గొననున్న మంత్రులు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ఆనంద్ బాబు.
టీడీపీ నుంచి కళా, వర్ల రామయ్య,పయ్యావుల హాజరు
కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్, కొలనుకొండ శివాజీ హాజరు
సీపీఎం తరపున మధు, వై. వెంకటేశ్వరరావు హాజరు
సీపీఐ తరపున రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు హాజరు
లోక్ సత్తా నుంచి ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, భాను ప్రసాద్ హాజరు
ముస్లిం లీగ్, సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం, ఎన్జీవో, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, అమరావతి ఉద్యోగ జేఏసీ, ప్రత్యేకహోదా సాధన సమితి ప్రతినిధులు హాజరు
అఖిల సంఘం సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరు
సమావేశానికి హాజరుకాని వైసీపీ, బీజేపీ, జనసేన
ఇది అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అందరి సూచనలతో తుది నిర్ణయం తీసుకునేందుకే అఖిల సంఘం సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించిన సీఎం బాబు
రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతున్నాయన్న బాబు