యువతిపై ఆత్యాచారం ?
ఒంగోలు జనవరి 22
ప్రకాశం జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలు శివారుల్లో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు, స్థానికులు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో బట్టలు లేకుండా పడివుండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పృహలేకుండా పడి ఉన్న బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివున్నాయి. సదరు మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బాధిత మహిళ ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో ఆమెను ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని పొలీసులు భావిస్తున్నారు.