YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నింగిలోకి రోబో వ్యోమ‌మిత్ర‌ :ఇస్రో

నింగిలోకి రోబో వ్యోమ‌మిత్ర‌ :ఇస్రో

నింగిలోకి రోబో వ్యోమ‌మిత్ర‌ :ఇస్రో
బెంగుళూరు జనవరి 22  
మాన‌వ‌ర‌హిత మిష‌న్ గ‌గ‌న్‌యాన్‌ను ఇస్రో వ‌చ్చే ఏడాది చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే.  అయితే ఆ యాత్ర కోసం ఇస్రో ఓ రోబోను త‌యారు చేసింది.  గ‌గ‌న్‌యాన్‌లో భాగంగా హాఫ్ హ్యుమ‌నాయిడ్ వ్యోమ‌మిత్ర‌ను నింగిలోకి పంనున్నారు.   మాన‌వ శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల ప‌నితీరును ప‌రీక్షించేందుకు ఇస్రో ఈ హాఫ్ హ్యుమ‌నాయిడ్‌ను పంప‌నున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త శ్యామ్ ద‌యాల్ తెలిపారు. నింగిలోకి ఓ రోబోను పంపిస్తామ‌ని, దాని నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్‌ను అందుకుంటామ‌న్నారు. ఇది కేవ‌లం ప్ర‌యోగాత్మ‌క ప‌ద్ధ‌తిలో చేస్తామ‌న్నారు. వ్యోమ‌మిత్ర మిమిక్రీ చేయ‌గ‌ల‌దు.  మ‌నుషులతో సంభాషించ‌గ‌ల‌దు.  2022లో నింగిలోకి మానవుల‌ను పంపాల‌ని ఇస్రో భావిస్తున్న విష‌యం తెలిసిందే.  దానిలో భాగంగానే వ్యోమ‌మిత్ర‌ను ప్ర‌యోగించ‌నున్నారు.  బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వ్యోమ‌మిత్ర‌ను జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రిచ‌యం చేశారు. 

Related Posts