YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానుల ఏర్పాటు ఈజీ కాదు

మూడు రాజధానుల ఏర్పాటు ఈజీ కాదు

మూడు రాజధానుల ఏర్పాటు ఈజీ కాదు
విజయవాడ జనవరి 22, 
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్న ఆయన తమకు కేంద్రం, కోర్టులు ఉన్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని చెప్పారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని అన్న ఆయన హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. రాజధానిలో భూముల కొనుగోలులో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనని అన్నారు. అలాగే మూడు రాజధానులను ఏర్పాటు చేయడం అంతా వీజీ కాదన్నారు జేసీ. రాష్టంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని జేసీ విమర్శించారు. జగన్ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటున్నారని  ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు. అలాగే వేసుకున్న బట్టలు విప్పేసి ఇలాగే పుట్టినపుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా ఆలాగే తిరుగుతామంటే ఎవరూ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.

Related Posts