YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 గవర్నర్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

 గవర్నర్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

 గవర్నర్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
విజయవాడ, జనవరి 22, 
అసెంబ్లీలో తమపై దాడులు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు బుధవారం టీడీపీ శాసన సభాపక్షం లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాసనసభ వ్యవహారాలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తుంటే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ‘అసెంబ్లీని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా వెంటనే చర్యలు చేపట్టాలి. సభలో స్పీకర్, అధికార వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగాలేదు. అప్రజాస్వామిక విధానాలతో శాసనసభ నడుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీకి అనుగుణంగా సభను నిర్వహిస్తున్నారు.సభాపతి సైతం మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వివక్ష చూపుతూ సొంత పార్టీ సభ్యులకు అనుకూలంగా ఆయన వ్యవహారశైలి ఉంటోంది’’ అని గవర్నర్‌కు రాసిన లేఖలో తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు

Related Posts