జపం - తపం - ఉపాసన
మనిషి దైవానుగ్రహం పొందటానికి ఎన్నో మార్గాలున్నాయి.
మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించటానికి చేసే ప్రయత్నాలివి. వీటిని
ఇందులో కొన్ని మార్గాలే ఈ జపము, తపస్సు, ఉపాసన మొదలైనవి. ఉపాసన అనేది ఒకవిధంగా భక్తికి పర్యాయ పదం. ‘యస్య విశ్వ ఉపాసతే’ అని వేదవాక్యం. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటం.
మనం ఏ ఆధ్యాత్మిక సాధన ప్రారంభించినా మన ఇంటిలో దేవునిపూజా మందిరంలోనో, దేవాలయంలోనో దేవుని ప్రతిమకు దగ్గరగా కూర్చుంటాం. అదే సమయంలో మనసు కూడా దైవచింతనతో ఉంటే (మనిషితో పాటు మనసూ దేవునికి దగ్గరగా ఉంటే) ‘ఉపాసన’ సార్థకమవుతుంది.
ఇక ‘జపము’ అంటే ఒక దైవరూపాన్ని మనసులో భావిస్తూ ఆ దైవానికి చెందిన మంత్రాన్ని ప్రతిరోజూ నియమితమైన సమయంలో ఉచ్చరించటం. ఇలా నిరంతరం చేయగా ఆ దైవరూపం హృదయంలో స్థిరపడి పవిత్రమైన భావాలు ఏర్పడతాయి. అందుకే ‘జపతో నాస్తి పాతకం’ అన్నారు పెద్దలు. ఈ జపమే మరింత తీవ్రస్థాయిలో సాగితే అది ‘తపస్సు’. నిజానికి తపస్సు అనే మాటకు ‘ఏకాగ్రత’ అని అర్థం చెప్పవచ్చు. .ఇంద్రియాలు అటూ ఇటూ పోకుండా మనసుకు లోబడి, ఆ మనసు పరమాత్మయందు లగ్నం కావటం తపస్సు.
*జై శ్రీమన్నారాయణ*