వచ్చే ఎన్నికలలో తామైతే ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని వైసిపి నేత, నెల్లూరు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో మేం ఎటూ వెళ్లేది మీరే చూస్తారు కదా అని ఒక ప్రశ్నకు సమాదానంగా అన్నారు.తాము బిజెపితో ఎందుకు కలిసి వెళతామని, ప్రస్తుతం మోడీ గ్రాఫ్ తగ్గుతుండడంతో టిడిపి తన వైఖరిని మార్చుకుందని,రేపు మళ్లీ మోడీ గ్రాఫ్ పెరుగుతోందని అనుకుంటే చంద్రబాబు మళ్లీ బిజెపి అన్నా ఆశ్చర్యం కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో ఇరవై లోక్ సభ సీట్లను ఇస్తే రాష్ట్ర ప్రయోజనం కోసం కేంద్రంలో పోరాడుతుందని ఆయన అన్నారు.బిజెపితో కలిసే అవకాశం లేదని, అయితే వామపక్షాలు వారు ఎవరైనా తమ షరతులకు లోబడి కలిసి పనిచేస్తామంటే అప్పుడు ఆలోచించవచ్చని మేకపాటి అన్నారు.బిజెపితో లోపాయి కారి ఒప్పందం లేదని కూడా ఆయన అన్నారు.