తిరుమలలో ప్రముఖులు
తిరుమల జనవరి 23
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.అందులో ప్రధానంగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్, నేషనల్ ఎస్సి కమిషన్ మెంబర్ రాములు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజచేశారు. 1200 మంది దివ్యాంగులకు సహయ,సహకారాలు అందించేందుకు ప్రధానమంత్రి మోడీ కోటి యాభై లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు కేంద్రమంత్రి థావర్ చంద్. అందులో భాగంగా నేడు తిరుపతిలో జరిగే దివ్యాంగుల సభకు విచ్చేశానన్నారు. తిరుపతిలో 1200 మంది దివ్యాంగులకు పైనాన్షియల్ అసిస్టెంట్స్ అందిస్తున్నామని, దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం కల్పించేలా స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు నేషనల్ ఎస్సి కమిషన్ రాములు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు గిట్డుబాటు ధరలు రావాలని, విద్యార్థులు ఫాసై, మంచి ఉద్యోగాలు రావాలని ప్రార్ధించినట్లు తెలిపారు