YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నాణ్యమైన విత్తన వంగడాలను అందించాలి

నాణ్యమైన విత్తన వంగడాలను అందించాలి

నాణ్యమైన విత్తన వంగడాలను అందించాలి
హైదరాబాద్ జనవరి23 br /> ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి, దూరదృష్టితో ఆరేళ్లలోనే రాష్ట్రంలో సాగునీరు సమృద్దిగా అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.   రైతుల పంటల సాగుకు  అనుగుణంగా సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ నిపుణుల అవసరం ఉంది.  ఏఏ ప్రాంతాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు , కళాశాలలు ఏర్పాటు చేయాలో పరిశీలించండి. ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ అనుబంధ కళాశాలల ఏర్పాటు ఆవశ్యకత ఉందని అయన అన్నారు. గురువారం నాడు అయన సైఫాబాద్ లోని హోం సైన్స్ కళాశాలలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్  డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ సేద్యం పెరిగిన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తన వంగడాలను అందిచాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని అన్నారు. 
వ్యవసాయం , వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోనే వ్యవసాయం మీద ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం వ్యవసాయ రంగం మీదే ఖర్చు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుల ఆత్మహత్యల వార్తలే పేపర్లలో వచ్చేవి. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ఆత్మహత్యలు  ఆగిపోయాయి. వ్యవసాయానికి ముఖ్య వనరు అయిన సాగు నీటి కోసం ప్రతీ ఏడాది 25  వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,  ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్,  విష్ణువర్దన్ రెడ్డి,  టాసా అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్,  ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజనీకాంత్,  హోం సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రత్నకుమారి ఇతరులు హాజరయ్యారు. 

Related Posts