YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో టీడీపీకి రాజధాని సెగ

కర్నూలులో టీడీపీకి రాజధాని సెగ

కర్నూలులో టీడీపీకి రాజధాని సెగ
కర్నూలు, జనవరి 23 :
టీడీపీకి రాజధాని సెగ తగలింది. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించి సెలక్ట్ కమిటీకి పంపించడాన్ని నిరసిస్తూ.. కర్నూలులో విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశాయి. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి. ఆఫీస్ బయట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించాయి. వెంటనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది.ఇదిలా ఉంటే రాయలసీమతో పాటూ ఉత్తరాంధ్రలో కూడా చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని.. ఆయన రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడక్కడా చంద్రబాబు దిష్టిబొమ్మల్ని దగ్థం చేశారు. టీడీపీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు.బుధవారం శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ రాయలసీమతో పాటూ ఉత్తరాంధ్రలో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అంతేకాదు బుధవారం విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని ముట్టడించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Related Posts