YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు

ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు

ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు
ఒంగోలు, జనవరి 23, :
రాష్ట్రంలో ఫిబ్రవరి 14వ తేది నాటికి ఓటర్ల జాబితాను ప్రచురించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా ప్రచెరించడానికి, జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల నమోదు కోసం వచ్చిన అర్జీలను ఫిబ్రవరి 3వ తేదిలోగా విచారించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ పూర్తి అయిన తరువాత నియోజకవర్గ ఇ.ఆర్.ఓల లాగిన్ నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలను ఇ.ఆర్.ఓ లాగిన్ లో మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ నెల 25వ తేది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారులు ప్రజాప్రతి నిధుల పేర్లు ఓటర్ల జాబితాలో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
ఈ వీడియోకన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురించడినికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఓటర్ల నమోదు కోసం వచ్చిన అర్జీలు 18 వేలు పెండింగ్ లో వున్నాయని త్వరితగతిన అర్జీలు పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన తెలియజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒంగోలు నగరంలో 3కె రన్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్  లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.షాన్ మోహన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎమ్. వెంకటసుబ్బయ్య, కొండేపి నియోజకవర్గ ఇ.ఆర్.ఓఅద్దెయ్య, కనిగిరి నియోజకవర్గ వసంతరావు, దర్శి నియోజకవర్గ క్రిష్ణవేణి, తదితురులు పాల్గొన్నారు.

Related Posts