YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు : సైబరాబాద్‌ సీపీ

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు : సైబరాబాద్‌ సీపీ

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు : సైబరాబాద్‌ సీపీ
హైదరాబాద్‌ జనవరి 23: 
 సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎక్కడో కూర్చుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు నిపుణులతో అవగాహన కల్పించామని తెలిపారు. సైబర్‌ నేరాలతో మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా కూడా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని సీపీ తెలిపారు. త్వరలో పాఠశాలలు, కళాశాలల్లో నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు.రోజు రోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చైర్మన్‌ భరణి తెలిపారు. సామాన్య ప్రజల నుంచి ఐటీ కంపెనీల వరకు సైబర్‌ క్రైం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఐటీ కంపెనీల డేటాను చోరీ చేసిన సందర్భాలు ఉన్నాయని భరణి గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న నేరాలపై కూడా కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు భరణి. 

Related Posts