YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు వారివి

గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు వారివి

గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు వారివి
మెదక్, జనవరి 24,
మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ అంతంతగా నే ప్రభావం చూపనున్నాయి. బుధవారం జరిగిన పోలింగ్‌ రోజున బూత్‌ల వద్ద స్వతంత్రు ల హవా కొనసాగింది. ముఖ్యంగా గజ్వేల్‌ మున్సిపల్‌లో స్వతంత్రులు సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉందోననే ఆసక్తి అంతటా నెలకొంది. మున్సిపల్‌ పోలింగ్‌ శైలి ద్వారా ఒకింత క్లారిటీ వస్తోంది. జిల్లాలో ఎన్నికలు జరిగిన గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లోనూ రసవత్తరంగా పోలింగ్‌ సాగింది. పార్టీలతో పాటు స్థానికతకు కూడా పెద్దపీఠ వేసే పరిస్థితి ఉన్నందున గెలుపోటములపై ఉత్కంఠ తప్పడం లేదు.
టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ రెబల్స్‌...
అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల కంటే వారి సొంత పార్టీకి చెందిన అభ్యర్థులతోనే తలనొప్పి తయారైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులు అధికార పార్టీ నాయకులకు దీటుగా ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించారు. టీఆర్‌ఎస్‌ బీఫాంలు ఆశించిన భంగపడ్డ వారు రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరు పోలింగ్‌ రోజున వాడ వాడలా తిరిగి ఓటర్లను కలిసి ఆటోల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. జిల్లాలోని 69 వార్డుల్లో 47 మంది వీరే ఉండడం గమనార్హం. 25 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉన్నట్టు పోలింగ్‌ శాతం ద్వారా తెలుస్తోంది. ఫలితంగా కారు గుర్తుతో గెలిచే అభ్యర్థుల సంఖ్యకు గండిపడే అవకాశాలు కనిపిస్తు న్నాయి. అదే జరిగితే చైర్మెన్‌ పదవులు కూడా తారుమారయ్యే పరిస్థితులు లేకపోలేదు.అన్ని విధాలుగా టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ఆధిక్యత ప్రదర్శించడంలో ముందున్నది. అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీలో నిలవడమేగాక ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. 72 వార్డుల్లో 61 వార్డుల్లో కాంగ్రెస్‌, 57 చోట్లా బీజేపీ, సీపీఐ(ఎం), 7 వార్డుల్లో టీడీపీ, దుబ్బాకలో 2, చేర్యాలలో 7 వార్డుల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు పోటీ చేస్తున్నా రు. ఈ స్థానాల్లో గెలిచేందుకు హోరాహోరీగా అన్ని పార్టీలూ పోలింగ్‌ శాతాన్ని పెంచే ప్రయత్నాలు చేశాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీలు పెద్దగా గెలుపొందలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ(ఎం), టీడీపీలు మున్సిపల్‌లో పోటీ చేశాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా ప్రాతినిధ్యం దక్కించుకునే ప్రయత్నాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా సీపీఐ(ఎం) మాత్రం ప్రజా పోరాటాల వైపే మొగ్గు చూపుతుంది.వార్డుల వారీగా జరిగే ఎన్నికలు కావడంతో స్థానికుల మద్దతుతో స్వతంత్రులు పెద్ద సంఖ్యలోనే బరిలోకి దిగారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజల మద్దతును కూడగట్టుకుని ప్రచారం చేశారు. పోలింగ్‌ రోజు కూడా స్వతంత్రులు ఓటర్లను సొంత వాహనా లపై పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. పార్టీల బలాబలాల కంటే తమ వ్యక్తిగత ఛరీష్మానే నమ్ముకున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు బయట పడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు జరిగే 69 వార్డులకు గాను 68 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడంతో స్వతం త్రులకే ఎక్కువ అవకాశం ఉంది. అది కాక అధి కార పార్టీ నాయకులకు కూడా స్వతంత్రులతోనే ఓటమి చెందే అవకాశం ఉంది.మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ శాతం అభ్యర్థులు తాయిలాల పంపిణీపైనే ఆధారపడ్డారు. ప్రజల మద్దతు ఉన్నా డబ్బునే నమ్ముకున్నారు. 15 నుంచి వివిధ రూపాల్లో నగదును మంచినీళ్లలా ఖర్చు చేశారు. నిత్యం విందులు, మద్యం పంపిణీ, ఆర్భాటమైన ప్రచారాలకు డబ్బులు వెచ్చించారు. ఇక సంక్రాంతి పండుగకు, ప్రస్తుతం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. తీవ్రమైన పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు రూ. 5 వేల వరకు ఇచ్చారనే చర్చ చక్కలు కొడుతున్నది. గెలిస్తే చైర్మెన్‌ పదవి దక్కుతుం దని అనుకున్న వారు డబ్బు విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. బంగారు ఉంగరాలు, వెండి కుంకమ భరణిలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లను గోప్యంగా పంపిణీ చేశారు. స్వతంత్రులు, రెబల్‌ అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టేందుకు పోటీపడ్డారు.పోలింగ్‌ రోజు కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు

Related Posts