YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 ఆప్ దే... హస్తినంటూ సర్వేలు

 ఆప్ దే... హస్తినంటూ సర్వేలు

 ఆప్ దే... హస్తినంటూ సర్వేలు
న్యూఢిల్లీ, జనవరి 24  
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సీఏఏ, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 370వ అధికరణ రద్దు వంటి అంశాలు ఢిల్లీలో బీజేపీకి ప్రతిబంధకంగా మారుతున్నాయని చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్నారు. ఒకేసారి 70 మంది అభ్యర్థులను ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాదు 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇవ్వలేదు. పీకే టీం జరిపిన సర్వేలో వీరిపై వ్యతిరేకత కనపడటంతోనే వారికి ఈసారి టిక్కెట్లు దక్కలేదంటున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడుస్థానాల్లో ఒక్కటి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలేదు. దీంతో కేజ్రీవాల్ లో కలవరం ప్రారంభమయింది. అన్నింటికంటే ఎక్కువగా కాంగ్రెస్ పుంజుకోవడం ఆయనను ఇబ్బంది పెట్టే అంశమే. కాంగ్రెస్ రెండో స్థానంలోనూ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మూడో స్థానంలోనూ పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత మరిన్ని తాయిలాలను అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు ఇచ్చారు.పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తీర్పు వేర్వేరుగా ఉంటాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ గ్యారంటీ కార్డ్ ను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఢిల్లీ వాసులకు 24 గంటల విద్యుత్తును అందిస్తానని, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తానని గ్యారంటీ ఇచ్చారు. యమునానది ప్రక్షాళన, మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తమ గ్యారంటీ కార్డులో ివివరించడం విశేషం. నిజాయితీ, నిబద్దతతోనే పాలన కొనసాగిస్తామని చెబుతున్నారు. గ్యారంటీ కార్డుతో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

Related Posts