YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 ఏటీఎం ధ్వంసం..ఆరులక్షల నగదు చోరి

 ఏటీఎం ధ్వంసం..ఆరులక్షల నగదు చోరి

 ఏటీఎం ధ్వంసం..ఆరులక్షల నగదు చోరి
నిజామాబాద్ జనవరి 24 
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసారు. దాంట్లో నుంచి  ఆరు లక్షల 46 వేల నగదును దోచుకెళ్లారు. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో దుండగులు ఏటీఎంను గడ్డపారతో తొలగించి ధ్వంసం చేసి అందులో ఉన్న ఆరు లక్షల 46 వేల నగదును దోచుకెళ్లారు. ఏటీఎం కు సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో దొంగలు నిర్భయంగా డబ్బులను దోచుకెళ్లారు. శుక్రవారం  ఉదయం ఏటీఎం ధ్వంసం అయి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related Posts