YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

500 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి ప్రణాళికలు

500 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి ప్రణాళికలు

టిడిపి హయాంలో రాజధాని అభివృద్ధి  ప్రచారానికే పరిమితం
 అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం

500 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి ప్రణాళికలు
 రెండు వందల కోట్ల రూపాయలతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులు
18 కోట్ల నలభై లక్షలు రూపాయలతో హౌసింగ్ బోర్డ్  ప్రాంతంలో అభివృద్ధి పనులు
విజయవాడ జనవరి 24 
టిడిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధి ప్రచారానికే పరిమితం అయిందని, చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించలేదని, అభివృద్ధి సంక్షేమం  లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పని చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.శుక్రవారం మంత్రి నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో మంత్రి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.ప్రజల సలహాలు సూచనలతో నగర అభివృద్ధి పనులు చేపట్టిందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగర అభివృద్ధికి దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. పశ్చిమ నియోజకవర్గ లో రహదారుల పనుల నిమిత్తం వంద కోట్ల రూపాయలు... కృష్ణ నదీ పరివాహక ప్రాంతంలో రామలింగేశ్వర నగర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 122 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.28వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో పార్క్, రిటైనింగ్ వాల్ నిర్మాణము మరియు స్పోర్ట్స్ ... డ్రైనేజీ పనులను నిమిత్తం 18 కోట్ల 40 లక్షల రూపాయలను నిధులు కేటాయించినట్లు తెలిపారు..ఏడు నెలల కాలంలో నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు పర్యటించి.. ప్రజల సలహాలు సూచనల మేరకు అభివృద్ధి పనులను త్వరలో పూర్తిస్థాయిలో చేపడతామన్నారు.పర్యటనలో నగర పాలక సంస్థ అధికారులు మరియు వివిధ శాఖల  అధికారులతో పాటు వై ఎస్ ఆర్ సి పి పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు...

Related Posts