YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటే, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నట్టే

 వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటే, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నట్టే

 వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటే, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నట్టే
 నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు
తుగ్గలి జనవరి 24
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వైసీపీ నాయకులు తెలియజేశారు. శాసన మండలిలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినందుకు నిరసనగా వైసిపి నాయకులు మండల కేంద్రమైన తుగ్గలిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం,బైక్ ర్యాలీ ని ఉప్పరపల్లె సింగిల్విండో అధ్యక్షుడు ప్రహల్లాద రెడ్డి మరియు మండల కన్వీనర్ జిట్టా నాగేష్ జెండా ఊపి ప్రారంభించారు.రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం కూడలి వద్ద చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేసి వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైసిపి నాయకులు మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, వికేంద్రీకరణ బిల్లు తోనే రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేశారు.కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ కావడం ద్వారా జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాతన మోహన్ రెడ్డి,తుగ్గలి మోహన్ రెడ్డి,రాతన ఉమ్మన్న,ఎర్ర నాగప్ప, ప్రతాప్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts