YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ఓయూలో బంద్

 ఓయూలో బంద్

 ఓయూలో బంద్
హైదరాబాద్ జనవరి 25
ప్రొ.కాసీంను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం  ఓయూ లోని అర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, పరిపాలన భవనం, పరీక్షల విభాగం, లైబ్రరీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, ఏ ఎం ఎస్ కాలేజ్ లు స్వచ్ఛందగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రొఫెసర్ కాశీం అరెస్ట్ చేసారని ఆరోపించారు. నిరంతరం విద్యార్థుల తరపున మాట్లాడుతూ, సామాజిక సమస్యల పట్ల స్పృహ కలిగి ఉండి నిత్యం ప్రజలతోనూ, విద్యార్థులతోను నడుస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ కాశీం అని పేర్కొన్నారు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థ పతనం, కుల వ్యవస్థ, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అణచివేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందు వల్లే ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని, తక్షణమే ప్రభుత్వం ప్రొఫెసర్ కాశీం పై పెట్టిన ఊపా కేసులను ఎత్తివేసి ఆయనును విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేసారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ కాంపల్లి శ్రీనివాస్,ఎస్ఎఫ్ఐ రవినాయక్ , పి డి ఎస్ యూ జ్యోతి,రంజిత్,టి వి వి గోపి,ఎం ఎస్ ఎఫ్ కొమ్ము శేఖర్ , టి ఎస్ యూ కృష్ణ మాదిగ,ఎం ఎస్ ఎఫ్-టి ఎస్ తిరుమల్లేశ్ ,డి ఎస్ యూ జనార్దన్,  పి డి ఎస్ యూ(వి) సృజన్,బిఎస్ఎఫ్  బొర్రెలి సురేష్,సి ఎం ఎస్ సాహితి తదితరులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts