YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి. జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి 
కర్నూలు, జనవరి 24  
 నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి పేర్కొన్నారు.   జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లను రక్షిద్దాం ... ఆడ పిల్లను చదివిద్దాం జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సునయఆడిటోరియంలో  ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి  రవి పట్టన్ షెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాలబాలికల మధ్య తేడాలు చూపవద్దన్నారు. చిన్నతనం నుంచే బాలికలకు అవకాశాలు కల్పించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందన్నారు.  పీవీ సింధు లాంటి మహిళలను నేటి బాలికలు ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానానికి  అధిరోహించాలన్నారు. బేటి బచావో - బేటి పడావో కార్యక్రమాన్ని పాఠశాల, కళాశాల, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఐసిడిఎస్ అధికారులకు జెసి సూచించారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్ మాట్లాడుతూ స్త్రీ జాతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సామాజిక బాధ్యతతో బాల్య వివాహాల నివారణకు కలిసికట్టుగా కృషి  చేద్దామన్నారు. ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించి బాలికల్లో మనోధైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. బ్రూణ హత్యల నిరోధాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వ్యతిరేకించాలన్నారు. బాలికల్లో పౌష్టికాహార లోపాలను అరికట్టడంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలికలు చదువుతోపాటు క్రీడా, కళా రంగాల్లో రాణించాలన్నారు. ఆడపిల్లలు సమాజానికి మణిహారంలాంటి వారని, వారికి రక్షణతో పాటు భవిష్యత్తుకు పునాది వేసి అభివృద్ధికి పాటుపడుదామన్నారు. అనంతరం  పలు అంశాల్లో ప్రతిభ చూపిన  సి డి పి ఓ ఏంజెల్, సూపర్వైజర్ అంజనమ్మ, అంగన్వాడి వర్కర్ పర్వీన్ బేగం, పది పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్థిని రాజమ్మ, కోర్సులో ప్రతిభ కనబరిచిన బాలిక సి దేవి, డ్రాయింగ్ కాంపిటీషన్ లో మానస, రమ్య శ్రీ, స్లోగన్ కాంపిటీషన్లో మానస, కీర్తన, వ్యాసరచన పోటీల్లో లలిత ప్రియ బాలికలకు జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మొహిదీన్, డి ఆర్ వో పుల్లయ్య, ఐసిడిఎస్ పిడి భాగ్య రేఖ, ఏపీడీ విజయా లు అన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన బాలికలు మహిళల కు బహుమతులు, మెమొంటో లతోపాటు ఘనంగా నిర్వహించారు. జాతీయ బాలికల దినోత్సవం వేడుకలలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సురేంద్రబాబు, మెప్మా పిడి తిరుమలేశ రెడ్డి, ఆర్ బి ఎస్ కోఆర్డినేటర్ హేమలత, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేదవతి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి రాజేశ్వరి జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Related Posts