YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగతమైన కక్షతో శాసనమండలి  రద్దు సరికాదు 

వ్యక్తిగతమైన కక్షతో శాసనమండలి  రద్దు సరికాదు 

వ్యక్తిగతమైన కక్షతో శాసనమండలి  రద్దు సరికాదు  ౼ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం
కాకినాడ జనవరి24
కొత్తపేట 
శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేటలో  మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని బిల్లు సెలక్ట్ కమిటీ కి పంపడం అంటే బిల్లు ఆమోదించి నట్టు కాదు కాదని అలాగని  తిరస్కరించి నట్టు కాదని  ప్రజల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్ళమని  దీనిపై ఇంత రాద్దాంతం అనవసరమని సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన  తండ్రి ఏర్పాటు చేసిన శాసనమండలి ఎలా రద్దు చేస్తారని అన్నారు.వ్యక్తిగతమైన కక్షతో వ్వవస్ధలను రద్దు చేయడం సి.ఎం జగన్మోహన్ రెడ్డి కి మంచి పద్ధతి కాదని చెప్పారు.ఒకవేళ శాసనసభలో శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేసినా వెంటనే   రద్దు అవ్వదని అన్నారు.ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అక్కడ రద్దు చెయ్యాలని రూల్ అయితే ఏమి లేదని వారు చెయ్యొచ్చు ,చెయ్యక పోవచ్చని చెప్పారు. గతంలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం లో  ఇలాగే  శాసనమండలిరద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ కూడా ఆమోదించలేదని గుర్తు చేశారు.ఇప్పటికైనా శాసనమండలి. రద్దు పై ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చెయ్యాలని అన్నారు.

Related Posts