YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కారు జోరు కొనసాగుతోంది

కారు  జోరు కొనసాగుతోంది

అంతా ఊహించనట్టుగానే టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ సొంతంగానే కైవసం చేసుకుంది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  ఈ ఎన్నికల్లో పుంజుకుని టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఏ మాత్రం ఫలించలేదనే విషయం ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 81, కాంగ్రెస్6, బీజేపీ 1 మున్సిపాలిటీని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 9 మున్సిపల్ కార్పొరేషన్లు టీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక కొల్లాపూర్‌లో మాజీమంత్రి జూపల్లి మద్దతుదారులు పెద్దఎత్తన గెలిచి ఆ మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను స్వతంత్రులుగా బరిలోకి దింపిన మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు...  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, నారాయణఖేడ్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.  వారిని గెలిపించుకోవడంలోనూ విజయం సాధించారు. ఇక మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే... టీఆర్ఎస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. 

Related Posts