YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఫిబ్రవరి 7 నుంచి బాబు విచారణ

 ఫిబ్రవరి 7 నుంచి బాబు విచారణ

 ఫిబ్రవరి 7 నుంచి బాబు విచారణ
విజయవాడ, జనవరి 25
టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై దివంగత ఎన్టీఆర్ సతీమణి, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు..  మరోసారి విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టులో చంద్రబాబుకు ఇచ్చిన స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలంటూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై ఎప్పటి నుంచో లక్ష్మీపార్వతి అవినీతి అరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించేవారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆస్తులపై ఫిర్యాదు చేశారు.
=============================

Related Posts