టర్కీలో భూకంపం..19 మంది మృతి
ఇస్తాంబుల్ జనవరి 25
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. దాదాపు ఆరు వందలమంది గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైన తీవ్రత.. టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్ ఫ్రావిన్స్లోని సివ్రిస్ జిల్లాలో సంభవించింది. ఘటనలో పది భవంతులు కూలిపోయాయి. భూకంపకేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు సర్వే అంచనా వేసారు. టర్కీలో భూకంపాలు సాధారణం. పశ్చిమ టర్కి నగరం ఇజ్మీట్ లో 1999 లొ సంభవించిన భారీ భూకంప ప్రమాదంలో దాదాపు పదిహేడు వేలమంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో మృతి చెందిన వారిలో 13 మంది ఇలాజిజ్ ఫ్రావిన్స్కు చెందిన వారు కాగా... నలుగురు మలాటయా ఫ్రావిన్స్, దియిర్బకీర్ చెందిన ఒకరు గా గుర్తించారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో భవనాలు తీవ్రంగా నేలకూలాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొరుగున వున్న సిరియా, లెబనాన్, ఇరాన్ లలో కుడా భూప్రకంపనలు నమోదయ్యాయి.