YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

107 టీఆర్ఎస్, 7 కాంగ్రెస్,  రెండు బీజేపీ, ఎంఐఎంలు గెలు

107 టీఆర్ఎస్, 7 కాంగ్రెస్,  రెండు బీజేపీ, ఎంఐఎంలు గెలు

107 టీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 
రెండు బీజేపీ, ఎంఐఎంలు గెలుపు
హైద్రాబాద్, జనవరి 25
రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచిన 107 మున్సిపాలిటీలు మాత్రమే కాకుండా మరికొన్నింటిపై గులాబీ అధినేతలు కన్నేశారు. మరో రెండు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ రెబెల్స్ వశం చేసుకున్న నేపథ్యంలో కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో రెబెల్స్ టీఆర్ఎస్‌కే మద్దతు పలికే అవకాశం ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి వస్తే, మొత్తం గెలిచిన మున్సిపాలిటీలు 109 అవుతాయి. మరోవైపు, ఒకే వార్డు ఆధిక్యంలో ఉన్న హాలియా, నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలపైనా టీఆర్ఎస్ కన్నేస్తోంది. ఇంకా ఎక్స్ అఫీషియో ఓట్లతో ఒకటి లేదా రెండు మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. * మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ రెబెల్స్ హవా సాగిన సంగతి తెలిసిందే. జూపల్లి మద్దతుదారులైన వారే తాజా ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో కేటీఆర్ జూపల్లిని పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. * మొత్తం 120 మున్సిపాలిటీలకు గానూ  107 పురపాలికల్లో టీఆర్ఎస్‌ విజయ పతాక ఎగరవేసింది. కాంగ్రెస్ 7, బీజేపీ 2 (ఆమన్‌గల్ తుక్కుగూడ), ఎంఐఎం 2 (భైంసా, జల్‌పల్లి), ఇతరులు 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. * పీర్జాదీ గూడ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతోపాటు బండ్లగూడ, మీర్‌పేట్, బోడుప్పల్‌లోనూ విజయం సాధించింది. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లోని 22 డివిజన్లలో ఇప్పటివరకూ టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 5, బీజేపీ 2 దక్కించుకున్నాయి. బోడుప్పల్ నగరపాలిక పరిధిలోని 28 డివిజన్లలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 7, బీజేపీ 2, ఇతరులు 5 చోట్ల విజయం సాధించారు.* నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో భాజపా, ఎంఐఎం మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొంది. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో బీజేపీ 16 చోట్ల విజయం సాధించింది. ఎంఐఎం 9 స్థానాల్లో సత్తా చాటడం విశేషం. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని గెలుచుకోగా.. టీఆర్ఎస్ ఇప్పటి వరకూ ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేదు. అయితే, గులాబీ పార్టీ 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. * మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు చెంపపెట్టు లాంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబెల్స్ గెలవటం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదన్న కేటీఆర్.. గద్వాల, నిజామాబాద్, భైంసా వెళ్లి చూస్తే బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. * తాను గెలిచిన సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో 23వ వార్డు అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి డాన్సులు చేస్తూ, గాల్లోకి ఎగురుతూ తన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలంతా టీఆర్ఎస్‌కు ఒటేశారని చెప్పారు.

Related Posts