YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తప్పుడు ప్రచారంపై కేసులు

తప్పుడు ప్రచారంపై కేసులు

తప్పుడు ప్రచారంపై కేసులు
విజయవాడ, జనవరి 25,
పవన్ కళ్యాణ్‌కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు కూడబెట్టినట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్దితో కొందరు ప్రజావ్యతిరేకులు కుట్రలు పన్నారని ఆరోపించింది. వారి అనుచరగణంతో వ్యతిరేక ప్రచారాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ న్యాయ విభాగం కోఆర్డినేటర్ ఇవన సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని జనసేన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.అమరావతిలోనే రాజధాని ఉండాలని జనసేన పోరాటం చేస్తోందని సాంబశివ ప్రతాప్ తెలిపారు. ఈ ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండటంతో ప్రత్యర్థులు ఎదుర్కోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, సోషల్ మీడియాలో వక్రరాతలు రాస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో వారందరికీ లీగల్ నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు

Related Posts