Highlights
- రాజ్యసభ సాక్షిగా మోడీ కాళ్ళు మొక్కిిన విజయసాయి రెడ్డి
- రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి కాళ్ళు మొక్కి తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ తీరు మరోసారి బట్టబయలైంది. పార్లమెంట్ సాక్షిగా ప్రధాన నరేంద్ర మోదీ కాళ్ళకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మొక్కడం అక్కడ ఉన్న వారిని ఒక్కసారిగా విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే విజయసాయి రెడ్డి ఆడుతున్న డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్న విమర్శ వ్యక్తమవుతోంది. జగన్ కేసుల నుంచి విముక్తి కోసం ప్రధాని మోడీ చుట్టూ తిరుగుతున్న విజయసాయి రెడ్డి బిజెపితో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఆరోపణలు లేకపోలేదు. ఇక ముందు నుంచి కేంద్రంపై యుద్దమే అని ప్రకటిస్తున్న వైకాపా, ప్రధాని దగ్గర మాత్రం డ్రామాలు ఆడుతుంది. ప్రధానికి ఎక్కడా కూడా ఆగ్రహం కలిగించే విధంగా ప్రవర్తించడం లేదు. సభలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో గాంధి విగ్రహం వద్ద నిరసన చేపట్టే విజయసాయి రెడ్డి.. సభలో ప్రధాని లేకపోతే ఫ్లకార్డ్ పట్టుకుని నిరసన చెయ్యడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయాన్ని తెలుగుదేశం సభ్యులు కూడా ప్రస్తావించారు. అలాగే కేంద్రంపై అవిశ్వాసం అని చెప్పిన విజయసాయి రెడ్డి అవిశ్వాసం కాగితాన్ని పట్టుకుని ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడటం కూడా కెమెరా కళ్ళకు చిక్కింది. ఆ రోజు మీడియాని చుసిన ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజాగా మరోసారి రాజ్యసభలో విజయసాయి రెడ్డి డ్రామా ఆడారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కడం.. మోడీ కూడా ఆయనని ఆశీర్వదిస్తూ భుజం పై చేయి వేయడం వంటివి జరిగాయి. పార్లమెంటు సమావేశాలు ముగింపు రోజు ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని బీరాలు పలికిన వైసీపీ. మరి ట్విస్ట్ ఏంటి తిరుమలేశ. ఈ వైఖరి దేనికి సంకేతంగా బావించాలో..