లొసుగులు ఉపయోగించుకుంటున్న నిర్భయ నిందితులు
న్యూఢిల్లీ, జనవరి 27
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులు.. చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుంటున్నారు. తమకు విధించిన ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాత పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల తరఫున ఢిల్లీ సెషన్స్ కోర్టుకు హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసే వ్యూహాలను మాత్రమే నలుగురు దోషులు అనుసరిస్తున్నారని విన్నవించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పేపర్స్‌ను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు ఆలస్యం చేశారని ఆరోపిస్తూ వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్‌ల లాయర్ ఏపీ సింగ్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. లాయర్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు అందజేశారని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. దీంతో పిటిషన్ను అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ డిస్పోజ్ చేశారు. ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ… వినయ్ శర్మపై విష ప్రయోగం జరిగిందని, అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. జైలు అధికారుల నుంచి శుక్రవారం రాత్రి తనకు కొన్ని పత్రాలు అందాయని, కానీ వినయ్ వ్యక్తిగత డైరీ, మెడికల్ డాక్యుమెంట్లు మాత్రం ఇవ్వలేదని చెప్పారు. ‘‘వినయ్ శర్మపై స్లో పాయిజనింగ్ జరిగింది. అందుకే అతడిని ఆస్పత్రికి పంపారు. వినయ్ ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. వాటిని గురించి మేం రాష్ట్రపతికి తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే ఆ పెయింటింగ్స్ ద్వారా అతను ఎంత సంపాదించాడనే సమాచారం కూడా ఇవ్వాలి” అని కోరారు. పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.లాయర్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు అందజేశారని పోలీసుల తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ‘‘ఇలా పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను ఆలస్యం చేసే వ్యూహాలను దోషులు అనుసరిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా చట్టాన్ని ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నం. మేం అవసరమైన అన్ని పత్రాలను ముందే సరఫరా చేశాం. దోషులను ఉంచిన అన్ని జైళ్ల నుంచి అన్ని పత్రాలను సేకరించాం” అని వివరించారు. వినయ్ శర్మ వేసిన 10 పెయింటింగ్స్, స్కెచ్లు, ‘దరిందా’ పేరుతో రాసిన 19 పేజీల నోట్బుక్, ఇతర డాక్యుమెంట్లను కోర్టుకు జైలు అధికారులు తీసుకొచ్చారు. జడ్జి ఆదేశాలిస్తే వాటిని దోషులకు అందజేస్తామని చెప్పారు. దీనికి జడ్జి అజయ్ కుమార్ జైన్ స్పందిస్తూ.. ఇక ఎలాంటి డాక్యుమెంట్లు సరఫరా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.తీహార్ జైలు అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, నోట్బుక్, పెయింటింగ్స్లేదా స్కెచ్ల ఫొటోలు తీసుకోవచ్చని పిటిషనర్ తరఫు లాయర్కు జడ్జి సూచించారు. తమ వద్ద ఉన్న పత్రాలను అందజేయడం ద్వారా దోషులు చేసిన అభ్యర్థనను జైలు అధికారులు ఇప్పటికే పాటించారన్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. తర్వాత పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురినీ ఉరి తీయాలని సెషన్స్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 27 br /> దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులు.. చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుంటున్నారు. తమకు విధించిన ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాత పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల తరఫున ఢిల్లీ సెషన్స్ కోర్టుకు హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసే వ్యూహాలను మాత్రమే నలుగురు దోషులు అనుసరిస్తున్నారని విన్నవించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పేపర్స్‌ను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు ఆలస్యం చేశారని ఆరోపిస్తూ వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్‌ల లాయర్ ఏపీ సింగ్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. లాయర్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు అందజేశారని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. దీంతో పిటిషన్ను అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ డిస్పోజ్ చేశారు. ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ… వినయ్ శర్మపై విష ప్రయోగం జరిగిందని, అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. జైలు అధికారుల నుంచి శుక్రవారం రాత్రి తనకు కొన్ని పత్రాలు అందాయని, కానీ వినయ్ వ్యక్తిగత డైరీ, మెడికల్ డాక్యుమెంట్లు మాత్రం ఇవ్వలేదని చెప్పారు. ‘‘వినయ్ శర్మపై స్లో పాయిజనింగ్ జరిగింది. అందుకే అతడిని ఆస్పత్రికి పంపారు. వినయ్ ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. వాటిని గురించి మేం రాష్ట్రపతికి తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే ఆ పెయింటింగ్స్ ద్వారా అతను ఎంత సంపాదించాడనే సమాచారం కూడా ఇవ్వాలి” అని కోరారు. పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.లాయర్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు అందజేశారని పోలీసుల తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ‘‘ఇలా పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను ఆలస్యం చేసే వ్యూహాలను దోషులు అనుసరిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా చట్టాన్ని ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నం. మేం అవసరమైన అన్ని పత్రాలను ముందే సరఫరా చేశాం. దోషులను ఉంచిన అన్ని జైళ్ల నుంచి అన్ని పత్రాలను సేకరించాం” అని వివరించారు. వినయ్ శర్మ వేసిన 10 పెయింటింగ్స్, స్కెచ్లు, ‘దరిందా’ పేరుతో రాసిన 19 పేజీల నోట్బుక్, ఇతర డాక్యుమెంట్లను కోర్టుకు జైలు అధికారులు తీసుకొచ్చారు. జడ్జి ఆదేశాలిస్తే వాటిని దోషులకు అందజేస్తామని చెప్పారు. దీనికి జడ్జి అజయ్ కుమార్ జైన్ స్పందిస్తూ.. ఇక ఎలాంటి డాక్యుమెంట్లు సరఫరా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.తీహార్ జైలు అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, నోట్బుక్, పెయింటింగ్స్లేదా స్కెచ్ల ఫొటోలు తీసుకోవచ్చని పిటిషనర్ తరఫు లాయర్కు జడ్జి సూచించారు. తమ వద్ద ఉన్న పత్రాలను అందజేయడం ద్వారా దోషులు చేసిన అభ్యర్థనను జైలు అధికారులు ఇప్పటికే పాటించారన్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. తర్వాత పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురినీ ఉరి తీయాలని సెషన్స్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది.