YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

 శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

 శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని గత రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మండలి రద్దు చేస్తే పరిస్థితేంటి..? శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని జగన్‌ రద్దు చేస్తున్నారని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.మండలిలోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయాలి..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత కేబినెట్ ఇలా నిర్ణయించింది. మండలి రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ సర్కార్ పంపనుంది. పార్లమెంట్‌లోనూ బిల్లు ఆమోదం పొందాలి. కేంద్రం ఒప్పుకుంటే మండలి రద్దయ్యే అవకాశం ఉంది. కాగా.. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని గత రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని జగన్‌ రద్దు చేస్తున్నారని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

Related Posts