YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 తెలంగాణలో కమలానికి గ్రాఫ్

 తెలంగాణలో కమలానికి గ్రాఫ్

 తెలంగాణలో కమలానికి గ్రాఫ్
హైద్రాబాద్, జనవరి 27
ఎన్నికలతో పోలిస్తే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తంగా 298 సీట్లను గెలుచుకుంది. 2014 మున్సిపోల్స్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ 167 వార్డులను కైవసం చేసుకుంది. ఈసారి ఒంటరిగా పోటీ చేసినా 233 వార్డులు, 65 డివిజన్లలో పాగా వేసింది.మున్సిపల్‌‌ ఎన్నికల్లో బీజేపీ కొత్త ప్రాంతాలకు విస్తరించింది. గతంలో పార్టీ ఉనికి లేని మున్సిపాల్టీల్లో ప్రాతినిధ్యం సంపాదించింది. 60 శాతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో బీజేపీ క్యాండిడేట్లు కనీసం ఒకటి, రెండు స్థానాల నుంచి 28 స్థానాల వరకు గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా కమలదళం 298 సీట్లను గెలుచుకుంది2014 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ 167 వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఒంటరిగా బరిలో నిలిచినప్పటికీ 233 వార్డులు, 65 డివిజన్లను గెలుచుకుని 71 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లలో ప్రాతినిథ్యం సాధించింది. ఆమనగల్‌‌, తుక్కుగూడ, మక్తల్‌‌ మున్సిపాల్టీలు, నిజామాబాద్‌‌ కార్పొరేషన్‌‌లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఆదిలాబాద్‌‌, బైంసా, ఆర్మూర్‌‌, కోరుట్ల, మెట్‌‌పల్లి, హుజూరాబాద్‌‌, వేములవాడ, నర్సాపూర్‌‌, తాండూరు, గద్వాల, ఆత్మకూరు, కొత్తకోట, నారాయణపేట మున్సిపాల్టీలు, బడంగ్‌‌పేట, మీర్‌‌పేట కార్పొరేషన్లలో కాంగ్రెస్‌‌ పార్టీని వెనక్కి నెట్టి రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఓడిపోయిన చాలా వార్డుల్లోనూ బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. గతంతో పోలిస్తే ఆ పార్టీ పొలిటికల్‌‌ గ్రాఫ్‌‌ 100 శాతం పెరిగింది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ మున్సిపల్‌‌ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.టీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను రంగంలోకి దింపి ప్రచారం చేయించిందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. మజ్లిస్‌‌ను కలుపుకుని టీఆర్ఎస్ పోటీ చేస్తే, సీపీఐ, సీపీఎం, టీడీపీని కలుపుకుని కాంగ్రెస్ బరిలోకి దిగింది. మేం ఒంటరిగానే పోటీ చేశాం. అయినా 60% మున్సిపాల్టీల్లో మా అభ్యర్థులు గెలిచారు. 40 శాతం ఓట్లు పడ్డాయని టీఆర్‌‌ఎస్‌‌కు బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయమని చూపించామంటున్నారు

Related Posts