YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 విస్తరణకు ముహుర్తం కుదిరింది

 విస్తరణకు ముహుర్తం కుదిరింది

 విస్తరణకు ముహుర్తం కుదిరింది
బెంగళూర్, జనవరి 27
ఒకటి , రెండు రోజుల్లో కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రం పెద్దలతో చర్చలు జరిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణకు జేపీ నడ్డా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో కాకుండా కేవలం ఎనిమిది మందితో మాత్రమే మంత్రి వర్గ విస్తరణ జరపాలని జేపీ నడ్డా ఆదేశించినట్లు చెబుతున్నారు.మొన్న అనర్హత వేటు పడి తిరిగి గెలిచిన 11 మందిలో ఆరుగురికి మాత్రమే అవకాశం కల్పించ నున్నారు. అలాగే బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్ నేతలకు ఇద్దరికి ఈ విస్తరణలో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకుండా మంత్రి వర్గ విస్తరణ పరిమిత సంఖ్లో మాత్రమే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి వర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్న ఆశావహుల జాబితా పార్టీ కేంద్రకార్యాలయానికి చేరుకుంది.ీదీనిని జేపీ నడ్డా పరిశీలించి అమిత్ షాతో చర్చించిన తర్వాత ఓకే చెబుతారని టాక్. వీలయితే సోమవారం మంత్రి వర్గ విస్తరణను చేపట్టాలని యడ్యూరప్ప ఉన్నారు. ఆయన దావోస్ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత కొందరు సీనియర్ నేతలతో భేటీ అయి మంత్రివర్గ విస్తరణపై చర్చించారని చెబుతున్నారు. ఆయన సోమవారం విస్తరణ ఉండవచ్చని సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. దీంతో ఆశావహులు హస్తిన బాట పట్టారు.అయితే తొలినుంచి తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన 11 మంది ఎమ్మెల్యేలకు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప కోరుతున్నారు. దీనికి అధిష్టానం అంగీకరించలేదు. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగిలిన వారి సంగతి చూద్దామని అధిష్టానం చెప్పడంతో పరిమిత సంఖ్యలోనే మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు యడ్యూరప్ప రెడీ అయ్యారు. మరి సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరిగితే బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related Posts