YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంక్షేమ పథకాలే విజయ సోపనాలు.

సంక్షేమ పథకాలే విజయ సోపనాలు.

సంక్షేమ పథకాలే విజయ సోపనాలు.

సంక్షేమ పథకాలే మాకు విజయాన్ని అందిచాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందరూ సమన్వయంతో పని చేసారు. పుర ఎన్నికల్లో తెరాసకు ప్రజలు అద్భుత గెలుపునిచ్చారని అయన అన్నారు. శనివారం సాయంత్రం అయన మీడియాతో మాట్లాడారు.  ఘన విజయం అందించిన ఓటర్లకు అయన  ధన్యవాదాలు తెలిపారు.. గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని వినమ్రతతో అన్నారు. అన్ని చోట్లా ప్రజలు ఒకే రకమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారుఆరేళ్ల టీఆర్ఎస్ పాలనకు మంచి తీర్పుఇచ్చారని అన్నారుతాము అనుసరిస్తున్న పద్దతి ప్రజలకు నచ్చిందన్నారు  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామారావుకు నా ఆశీస్సులు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారింది. నేను అధికార దుర్వినియోగం చేశానని అంటున్నారు. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు..విపక్షాలపై అయన విరుచుకపడ్డారు. కొన్ని కుక్కలు నిరంతరం మొరుగుతునే వుంటాయి. ఎన్నికలను ఆపాలని ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేసాయని అయన విమర్శించారు. వారికి ఈ ఫలితాలు కొట్టిన చెంపదెబ్బ మామూలు దెబ్బకాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపక్షాలు ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించాలి. ఒక పని చేపట్టామంటే మేం రాక్షసుల్లా పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో మేం పెట్టిన ఖర్చు రూ.80 లక్షలు మాత్రమే. రూ.80లక్షలు పార్టీ మెటీరియల్‌ కోసం ఖర్చు చేశాం’’ అని కేసీఆర్‌ తెలిపారు

 

Related Posts