YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 చేపల వివాదాలతో రెండు గ్రామాలు

 చేపల వివాదాలతో రెండు గ్రామాలు

 చేపల వివాదాలతో రెండు గ్రామాలు
అదిలాబాద్, జనవరి 27,
నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలంలో గల బూత్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు, దస్తురాబాద్ మండాలనికి చెందిన మత్స్యకార్మికులు గోదావరిలో చేపలవేటకోసం చేస్తున్న వివాదాలు ఒకేసారి వేడెక్కాయి. రెండు గ్రామాల మత్స్యకార్మికులు రాంపూర్ గోదావరిలో తాము చేపలవేట కొనసాగిస్తామంటూ మరోపక్క తమకు హక్కు ఉన్నట్లు గొడవలు పడుతున్నారు. బూత్కూర్ పంచాయతీ పరిధిలోని రాంపూర్ సమీపంలో గల గోదావరిపై రాంపూర్ మత్స్యకారులు కొనే్నళ్లుగా చేపల వేటను కొనసాగిస్తున్నారు. వీరు కొద్దినెలల క్రితం గోదావరిలో గల చింతమడుగులో సొసైటి ఏర్పాటుచేసుకుని చేపలు పడుతున్నారు.  కొద్ది నెలల నుండి దస్తురాబాద్‌కు చెందిన మత్స్యకారులు గోదావరిలో చేపలుపట్టడానికి తమకు కూడా హక్కు ఉందంటూ గోదావరిలో చేపలు పట్టడానికి ప్రయత్నాలు చేయడంతో రెండుగ్రామాల మత్స్యకారుల మద్య వివాదాలు ఏర్పడుతున్నాయి. రాంపూర్ గోదావరిలో మత్స్యకార్మికులు చేపలు పట్టడం, దస్తురాబాద్ వాసులు వచ్చి చేపలు పట్టడంతో రెండు గ్రామాల మద్య వివాదం నెలకొనగా మత్స్యశాఖ,రెవెన్యూశాఖ, పోలీసు శాఖ అధికారులకు ఫిర్యాదుచేయడం కూడా జరిగింది. అయినా పై సమస్య పరిష్కారం కాలేకపోయింది. ఇదే సమయంలో రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు గోదావరిలో చేపలు పట్టడానికి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తేవడంతో రాంపూర్ గోదావరిలో గోదావరిలో చేపలు పట్టడానికి వీలుపడింది. చేపలు పట్టడానికి తమకు హక్కులు ఉన్నాయని, లైసెన్సులు కూడా ఉన్నాయని రాంపూర్ మత్స్యకారులు అంటున్నారు. కాగా మరోపక్క దస్తురాబాద్ మత్స్యకారులు గోదావరి తీర ప్రాంతంలో ఏ గ్రామమైన మత్స్యకారులకు చేపలు పట్టడానికి హక్కులు ఉంటాయని, ఈ గోదావరిలో చేపలవేట కొనసాగిస్తామంటూ గోదావరికి తరలిరావడంతో రెండు గ్రామాల మత్స్యకారుల మద్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మంగళవారం జిల్లా మత్స్యశాఖ అధికారి బాలకృష్ణ, ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్, దస్తురాబాద్ తహసిల్దార్ కలీం, ఆర్ ఐ రవీందర్, ఎస్సై రాజు, రాంపూర్ గోదావరిని సందర్శించారు. ఈ సంరద్భంగా మత్స్యకారులకు ఉన్న హక్కులపై, ఆ ప్రాంతంపై వారు విచారణ జరిపారు. ఇరు గ్రామాల మత్స్యకారులు ఎలాంటి గొడవలు పడవద్దని వారు హితవుపలికారు. ఏది ఏమైన రెండు గ్రామాల మత్స్యకార్మికుల మద్య గోదావరిలో చేపలవేటకై తరచూ వివాదాలు ఏర్పడుతుండడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని మత్స్యకార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పై సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Related Posts