YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 కాటేస్తున్న కాలం చెల్లిన బస్సులు

 కాటేస్తున్న కాలం చెల్లిన బస్సులు

 కాటేస్తున్న కాలం చెల్లిన బస్సులు
హైద్రాబాద్, జనవరి 27,
లం చెల్లిన సిటీబస్సులు వెదజల్లే కాలుష్యంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నగరంలోని 28 డిపోల్లోని 3850 బస్సులు రోజుకు 13 లక్షల కిలో మీటర్లు తిరుగుతూ సుమారు 38 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే వాటిలో కాలం చెల్లిన బస్సులను తొలగించక పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి.ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని ఉదాహరణగా తీసుకుని చెన్నై,బెంగుళూరు ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.పోరుగున ఉన్న చెన్నై రోడ్దు రవాణాశాఖ నాలుగు సంవత్సరాలు పాటు నగరంలో బస్సులను తిప్పి అనంతరం వాటిని జిల్లాలకు తరలిస్తున్నాయి. అదే విధంగా బెంగుళూరులో ఐదు సంవత్సరాల పాటు ప్రయాణికులకు సేవలు అందించిన బస్సులను నిలిపివేస్తున్నారు.ఈ విధంగా ఆయా రాజధాని నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఆయా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు ప్రభుత్వాలు సహయ సహకారాలను అందిస్తుండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో నగర ప్రజలు కాలుష్యం బారిన పడక తప్పడం లేదు. నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సుల కారణంగా నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోందని కాలుష్య నియంత్రణ మండలి కూడా ఎప్పుడో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బస్సుల వినియోగ కాలంలో 15 సంవత్సరాలు దాటినా లేదా 13 లక్షల కిలో మీటర్లు తిరిగినా సంబంధిత బస్సుల సేవలును ఆపివేయాలనే నిబంధన ఆర్టిసి గతంలోనే విధించింది.నగర కాలుష్యాన్ని తగ్గించే కార్యక్రమంలో భాంగంగా గ్రేటర్ ఆర్టీసీలో సీఎన్జీ బస్సుల సంఖ్య పెంచేందుకు కాలుష్య నియంత్రణ మండలి కృషి చేస్తోంది. పాత డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చి ఇవ్వడానికి అవసరం అయ్యే కిట్లను అందిచేందుకు ముందుకు వచ్చింది. సుమారు ఒకొక్క కిట్టు రూ.13.5 లక్షల వ్యయం అవుతుంది. ఈ కిట్లను 25 బస్సులకు అమర్చేందుకు సుముఖత చూపింది.సుమారు రూ.3.75 కోట్ల రుణానాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కనీసం 10 శాతం బస్సులైన మార్చాలని సిఎన్జీ బస్సులుగా మార్చాలని పీసీబీ కొద్దికాలంగా ప్రయత్నిస్తున్నా సాద్యం కావడం లేదు. వాయు కాలుష్యం తగ్గించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఆర్టీసీ బస్సులను పూర్తి సీఎన్జీ మార్చాలని నిర్ణయించి అమలు చేసి చూపించారు.రోజు రోజుకు నగరం విస్తరిస్తూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నా పూర్తి స్థాయిలో కాక పోయినా కనీస సంఖ్యలో కూడా సీఎన్జీ వైపు అడుగులు వేయలేక పోతున్నారు. నగర వ్యాప్తంగా 29 డిపోలు వుంటే కేవలం హాకంపేట, మేడ్చెల్, కంటోన్మెంట్ డిపోల పరిధిలోనే సీఎన్జీ బస్సులను తిప్పుతున్నారు. అన్ని డిపోల్లో చేపట్టడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టే సాధ్యడటం లేదని అధికారులు తెలిపారు. మూడు చోట్ల ఏర్పాటు చేసిన నేపథ్యంలో మేడ్చెల్లో మాత్రమే గ్యాస్ స్టోరేజ్ ఏర్పాటు చేశారని మిగిలిన రెండు చోట్ల విడివిడిగా సిలెండర్ల ద్వారా తీసుకు వచ్చి బస్సులకు నింపుతున్నారు. సీఎన్జీ స్టోరేజ్ పాయింట్లను అన్ని డిపోలలో ఏర్పాటు చేస్తే సమస్యలు ఉండవు అంటున్నారు. దీంతో పాటు డిజిల్ కన్నా సీఎన్జీ వాడితేనే కిలో మీటర్‌కు రూ.4 నుంచి రూ.5 వరకు ఇంధన వ్యయం తగ్గుతుంది.

Related Posts