YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వికేంద్రీకరణ ఆగదు

వికేంద్రీకరణ ఆగదు

వికేంద్రీకరణ ఆగదు
అనంతపురం  జనవరి 27
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా.. శాసనసభ, శాసనమండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను హరించడాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద నుంచి ఓవర్ బ్రిడ్జి, టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు గాంధీ విగ్రహం, శ్రీకంఠం సర్కిల్, రాజు రోడ్డు మీదుగా కొనసాగింది. బైక్ ర్యాలీకి యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. వైకాపా యువజన విభాగం అనంతపురం పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అంటే ఒక విజన్.. వైఎస్ జగన్ అంటే ఒక రోల్ మోడల్. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దడం ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విభజన తర్వాత అయిదేళ్లు సీఎం గా పనిచేశారు. కేవలం తన స్వలాభం కోసం పని చేశారు. ఎక్కడా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పాటు పడలేదని అన్నారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సాగిస్తున్నాం. దీన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు, టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం.శాసన మండలిలో ఉన్న బలాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఒక శకునిలా వ్యవహరించారు. ప్రజలకు మంచి చేసే విషయంలో అడుగడుగునా అడ్డుపడుతున్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించిన బిల్లుల విషయంలోనూ మంచి దిశగా చంద్రబాబు ఆలోచన చేయలేదు.  మా పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొన్నారు. సిగ్గు లేకుండా మా పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు చంద్రబాబు ఇచ్చారు. ఇది నైతికమా అని ప్రశ్నించారు. టీడీపీకి హయాంలో జన్మభూమి కమిటీల ముసుగులో దోపిడీ చేశారు.  ప్రజల వద్దకు పాలన తెచ్చెందుకే సచివాలయ వ్యవస్త తీసుకొచ్చాం. చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడు..రాయలసీమ ద్రోహి అని విమర్శించారు.  కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు పోరాటం చేస్తే కనీసం గుర్తించలేదు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో హైకోర్టు పెడతామంటే అడ్డుకోవడం దారుణం
గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురాలేదని అన్నారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని మేం విశ్వసిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉన్నా ఓటుకు నోటు కేసులో చిక్కుకుని పారిపోయి వచ్చిన దొంగ చంద్రబాబని ఆరోపించారు.అమరావతిలో రాజధాని పేరుతో ఇన్నాళ్లు జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. చంద్రబాబుతో సహా టిడిపి నుంచి గెలిచిన వారు మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామా చేసి మళ్ళి గెలవగలరా? చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడరు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఆగదని అయన అన్నారుజ

Related Posts