YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెద్దల సభలు..దండగే

పెద్దల సభలు..దండగే

పెద్దల సభలు..దండగే
విజయవాడ, జనవరి 27 
ఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాగా.. శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ శాసన సభలో ప్రవేశపెట్టారు. వెంటనే సభ్యులు బళ్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనపై సభ చర్చ చేపట్టగా.. మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో మనం హైదరాబాద్‌ను కోల్పోయమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జగన్ సర్కారు పని చేస్తోందన్నారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు.రాజధానిని తరలించడం లేదన్న ఆళ్ల నాని.. మరో రెండు రాజధానులను పెడుతున్నామని చెప్పామన్నారు. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. అనంతరం ధర్మన ప్రసాద రావు చర్చను కొనసాగించారు.101 దేశాల్లో పెద్దల సభలు లేవని ధర్మాన తెలిపారు. 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. బ్రిటిషర్ల కాలంలో వాళ్ల ప్రయోజనాల కోసం ఈ సభలను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిషర్ల వైఖరిని గాంధీజీ తప్పుబట్టారన్నారు. ప్రజల తిరస్కరణకు గురైన టీడీపీ రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటోందన్నారు. సభను పునరుద్ధించడానికి ఆలోచించాలి కానీ.. తొలగించడానికి కాదన్నారు. ఎన్నికల్లో గెలవలేకపోయిన వారికి పునరావస కేంద్రాలుగా ఎగువ సభలు మారాయని ఆరోపించారు. ఈ సభల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్నారు.బాబు ద్వంద్వ ప్రమాణాలు బయటపడాయని సభకు హాజరు కాకుండా భయపడి పారిపోయారని ధర్మాన ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గతంలో ఓ తీర్మానం పాస్ చేశారన్న ధర్మాన.. బాబు సొంత డబ్బా కొట్టించుకున్నారన్నారు. ఈ తీర్మానం చూసి.. తర్వాతి తరం నాయకులు బాబును గొప్ప నాయకుడు అనుకోవాలనే ఈ తాపత్రయం అన్నారు.అంతకు ముందు శాసన మండలి రద్దు నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. కానీ సభ పొడిగింపు విషయాన్ని బీఏసీలో చర్చించలేదని టీడీపీ గవర్నర్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసింది. దీంతో సభను వాయిదా వేసిన గవర్నర్.. బీఏసీ భేటీ అనంతరం తిరిగి ప్రారంభించారు. వెంటనే జగన్ మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

Related Posts