YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

డబ్బులు ఇవ్వకపోతే..రేప్ చేశారని కేసు

డబ్బులు ఇవ్వకపోతే..రేప్ చేశారని కేసు

డబ్బులు ఇవ్వకపోతే..రేప్ చేశారని కేసు
పూణె, జనవరి 27 
ప్రముఖులతో పరిచయం ఏర్పరచుకుని, వారితో సన్నిహితంగా మెలిగి తర్వాత పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న కిలేడీని మహారాష్ట్రలోని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ఓ కార్పోరేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇటీవల ఓ మహిళ పరిచయమైంది. కొద్దిరోజులకే వారిద్దరూ సన్నిహితులయ్యారు. మేనేజర్‌ పూర్తిగా తన మాయలో పడ్డాడని నిర్ధారణ చేసుకున్న ఆ మహిళ తనకు రూ.7లక్షలు కావాలని అడిగింది. అందుకు అతడు ససేమిరా అని చెప్పడంతో బెదిరింపులకు దిగింది.తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు రూ.45వేలు ఇచ్చాడు. ఆ డబ్బు చాలదని, మొత్తం రూ.7లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె వేధింపులకు గురిచేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర మొహిలే తన బృందంతో కలిసి శనివారం నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమెపై దోపిడీ, బెదిరింపు కేసులు నమోదుచేశారు.ఈ కిలేడీ మహిళ చాలా కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్‌ నిపుణులను సంప్రదిస్తూ వారితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటుందని, తర్వాత అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందని పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా.. జనవరి 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను జైలుకు తరలించారు.

Related Posts