YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ చర్చ : చంద్రబాబు

రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ చర్చ : చంద్రబాబు

రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ చర్చ : చంద్రబాబు
అమరావతి జనవరి 27   
రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న చర్చలలో పాల్గొనకూడదనే సభను బాయ్‌కాట్ చేశామని టీడీపీ శాసన సభాపక్షం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు టీడీపీ శాసన సభా పక్షం లేఖ రాసింది. సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లగించారని టీడీపీ శాసన సభా పక్షం ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారని లేఖలో టీడీపీ పేర్కొంది. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బీఏసీలో నిర్ణయించారని అయితే మరో మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించటం సబబు కాదని లేఖలో పేర్కొన్నారు. శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం రూల్స్‌‌కు విరుద్ధమన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కౌన్సిల్‌లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదని చెప్పారు.

Related Posts