YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

వచ్చే నాలుగేళ్లలో భారతీయ రైల్వేన పూర్తిగా విద్యుదీకరిస్తాం: పీయుష్ గోయెల్

వచ్చే నాలుగేళ్లలో భారతీయ రైల్వేన పూర్తిగా విద్యుదీకరిస్తాం: పీయుష్ గోయెల్

వచ్చే నాలుగేళ్లలో భారతీయ రైల్వేన పూర్తిగా విద్యుదీకరిస్తాం: పీయుష్ గోయెల్
న్యూఢిల్లీ జనవరి 27 
వచ్చే నాలుగేళ్లలో భారతీయ రైల్వేన పూర్తిగా విద్యుదీకరిస్తామని కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ అన్నారు. అప్పటి వరకు ప్రపంచంలోనే పూర్తిగా విద్యుదీకరించబడిన మొట్ట మొదటి రైల్వేగా భారత్ అవతరిస్తుందని ఆయన అన్నారు. ఇండియా-బ్రెజిల్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత రైల్వే నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుదీకరిస్తాం. 2024 వరకు ఈ పని పూర్తి చేస్తాం. మరో నాలుగేళ్ల తర్వాత భారత రైల్వేలోని రైళ్లన్నీ విద్యుత్ ఆధారంగానే నడుస్తాయి. ఇలా పూర్తి స్థాయిలో విద్యుదీకరించిన రైల్వేగా ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా నిలబడుతుంది. దీనికోసం క్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తాం’’ అని పీయుష్ గోయెల్ అన్నారు.ఇక బ్రెజిల్‌తో భారత్‌కు ఉన్న అనుబంధం గురించి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని, బ్రెజిల్‌తో స్నేహాన్ని తాము ప్రేమిస్తామని అన్నారు.

Related Posts