YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

.ఛైర్మన్ కోసం గులాబీలో గొడవలు

.ఛైర్మన్ కోసం గులాబీలో గొడవలు

.ఛైర్మన్ కోసం గులాబీలో గొడవలు
మెదక్, జనవరి 27,
మున్సిపల్ సంఘాల ఛైర్‌పర్సన్ల ఎంపిక సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. ఈ స్థానంలో పూర్తి మెజార్టీ సాధించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఛైర్మన్ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండటంతో రాజకీయం వేడెక్కింది.బొల్లారం మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున 17 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. అయితే.. ఛైర్మన్ పదవి కోసం స్థానిక అభ్యర్థులు చంద్రారెడ్డి, కొలను బాల్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లలో చంద్రారెడ్డికి 8 మంది మద్దతు పలుకుతుండగా.. బాల్ రెడ్డికి 9 మంది మద్దతు తెలిపారు. ముగ్గురు బీజేపీ, ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా బాల్‌రెడ్డికి మద్దతు పలుకుతుండటం గమనార్హం.సోమవారం  మధ్యాహ్నం ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడానికి ముందే బొల్లారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రారెడ్డి అనుచరులు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకొని ముందుకు వెళ్లేందుకు చంద్రారెడ్డి అనుచరులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. లాఠీఛార్జ్‌తో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఛైర్మన్ ఎన్నిక అంశంలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Related Posts