YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు 23 టెన్షన్

చంద్రబాబుకు 23 టెన్షన్

చంద్రబాబుకు 23 టెన్షన్
విజయవాడ, జనవరి 27,
తెలుగు దేశం పార్టీకి గతంలో ఆగస్టు సంక్షోభం ఉండేదని, కానీ ప్రస్తుతం అది మారిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఆగస్టు సంక్షోభం పోయి 2019 ఎన్నికల నుంచి 23 సంక్షోభం దాపురించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండలిని రద్దుపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ నెల 23నే చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు సోవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అమర్‌నాథ్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున అదే 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. విశేషమేంటంటే ఎన్నికల ఫలితాలను కూడా మే 23న ప్రకటించారు. ఎన్నికల్లో గెలిపొందిన తర్వాత ఈ 23 సెంటిమెంట్‌ను సీఎం జగన్ గుర్తు చేశారు. తాజాగా, మండలి రద్దును కూడా సీఎం జగన్ జనవరి 23నే ప్రకటించడం గమనార్హం. అలాగే టీడీపీ ఆగస్టు సంక్షోభం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గద్దె దించడంతో ప్రారంభమైంది. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ను గద్దె దింపి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఎన్టీఆర్ మూడోసారి 1994 డిసెంబర్‌లో సీఎంగా ఎన్టీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆగస్టులో మరోసారి టీడీపీలో సంక్షోభం నెలకొంది. అధికార పీఠం వ్యవహారంలో టీడీపీ.. ఎన్టీఆర్, చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.

Related Posts