ఆఫ్గనిస్థాన్ లో కూలిన విమానం
న్యూఢిల్లీ, జనవరి 27
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాలకే రాడార్ సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. అది తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఘజినీ ప్రావిన్స్‌లోని దేహ్ యాక్ జిల్లా సాడో ఖేల్ ప్రాంతంలో కూలిపోయినట్లు గవర్నర్ కార్యాలయ ప్రతినిధి ఆరిఫ్ నూరి వెల్లడించారు.ఈ విమానం సోమవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అదృశ్యమైందని ఆరిఫ్ తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయచర్యలు చేపట్టేందుకు దేశ భద్రతా దళాలు బయలుదేరి వెళ్లాయని అధికారులు వెల్లడించారు. ఈ విమానం హెరాత్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం వచ్చాక మీడియాకు వెల్లడిస్తామని ఆఫ్ఘన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించడం లేదు