తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు ముహూర్తం ఖరారు..
జగన్మాత ఆదిపరాశక్తి అంశలైన చల్లని తల్లులు , దయగల తల్లులు మరియు మనము కోరిన కోర్కెలను తప్పకుండా నెరవేర్చే మేడారం వన దేవతలైన శ్రీ సమ్మక్క, శ్ర సారలమ్మ తల్లుల ను మనస్ఫూర్తిగా స్మరించుకొనండి, ఈ వన దేవతలను దర్శించుకొనండి, అమ్మ వారుల చల్లని ఆశీస్సుల ను పొందండి
జాతర తేదీలుః-
• 2020 ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజుల రాక
• 6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
• 7న అమ్మవార్లకు మొక్కులు
• 8న తల్లుల వన ప్రవేశం
జాతరలో భాగంగా చిలుకలగుట్టపైనున్న సమ్మక్కను ఫిబ్రవరి 6న సాయంత్రం గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. ఫిబ్రవరి 7న సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఆ తర్వాత బుధవారం అంటే ఫిబ్రవరి 12న తిరుగువారం నిర్వహింస్తారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పించింది. హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఎంజీబీఎస్, జూబ్లీబస్స్టేషన్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్మెట్, కేపీహెచ్బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరి, ఉప్పల్లోని వరంగల్ పాయింట్ మీదుగా నడుస్తాయి.
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వివరాలను అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికులు జాతరకు వెళ్లేందుకు అడ్వాన్స్ రిజర్వేషన్ (www tsrtconline in) సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో.. ప్రత్యేక బస్సులు ఆన్లైన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.