YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం అడుగులపై ఉత్కంఠ

కమలం అడుగులపై ఉత్కంఠ

కమలం అడుగులపై ఉత్కంఠ
విజయవాడ, జనవరి 28,
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్ బిజెపి మెడకు ఉచ్చు బిగిస్తున్నారా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. శాసనమండలిని రద్దు చేసిన అనంతరం ఆ తీర్మానం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదానికి ఏపీ సర్కార్ పంపవలసి వుంది. దీన్ని తక్షణం ఆమోదించే వీలు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో మోడీ సర్కార్ కి వుండే అవకాశాలు తక్కువే. ఆ తరువాత జరిగే సమావేశాల్లో ఎపి ప్రభుత్వ తీర్మానం పార్లమెంట్ ఆమోదిస్తే బిజెపి వైఖరి స్పష్టం అయ్యే అవకాశాలు వున్నాయి. దాంతో కమలం వేయబోయే అడుగు ఎటు వైపు అనే ఉత్కంఠ ఏపీలో నెలకొంది.ఏపీ అసెంబ్లీ చేసే తీర్మానం వేగంగా ఆమోదిస్తే ఒకరకంగా ఆమోదించకపోతే మరోరకంగా బిజెపికి ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండలిని రద్దు తక్షణ ఆమోదం చేస్తే మోడీ, జగన్ నడుమ సంబంధాలు బలంగా ఉన్నాయని టిడిపి ప్రచారం మొదలు పెట్టనుంది. లేదు ఈ తీర్మానం ఆలస్యం అయితే కనుక టిడిపి చక్రబంధంలోనే కేంద్రం అడుగులు వేస్తుంది అంటూ వైసిపి ప్రచారం స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.శాసనమండలి రద్దు కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపినా సుమారు ఏడాదికి పైగానే దీని ఆమోదం పొందేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మోడీ సర్కార్ సైతం రాజ్యసభలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించక తప్పదని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికి మొత్తానికి జగన్ శాసనమండలి రద్దు చేస్తే తదనంతరం అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపడం ద్వారా కమలానికి కొత్త చిక్కు తెచ్చిపెట్టనున్నారనే అంచనా వేస్తున్నారు. మరి దీన్ని మోడీ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Related Posts