YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి గిత్తల బలప్రదర్శన

రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి గిత్తల బలప్రదర్శన

రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి గిత్తల బలప్రదర్శన
మండల పరిధిలోని పెండేకల్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ కాసిం స్వామి ఉరుసు సందర్భంగా 30వ తారీకు గురువారం రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి గిత్తల బలప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు స్థానిక వైసిపి నాయకుడు మారెళ్ళ సింగిల్విండో అధ్యక్షుడు అట్ల గోపాల్ రెడ్డి,బసి రెడ్డి తెలిపారు.ఒంగోలు గిత్తల బలప్రదర్శనకు ప్రారంభోత్సవానికి పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి వస్తున్నట్లు ఆయన తెలిపారు.మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకుడు మారెళ్ళ సొసైటీ సింగిల్విండో ప్రెసిడెంట్ అట్ల గోపాల్ రెడ్డి,రెండవ బహుమతిగా 20 వేల రూపాయలు చిన్న రంగన్న అనంతపురం,మూడవ బహుమతిగా 15 వేల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకుడు పాటిల్ సుధాకర్ రెడ్డి,నాలుగో బహుమతిగా 10 వేల రూపాయలు రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి,ఐదవ బహుమతిగా 8 వేల రూపాయలు వైయస్సార్ సిపి నాయకులు అట్లా దివాకర్ రెడ్డి,ఆరవ బహుమతిగా 5 వేల రూపాయలు వైసిపి నాయకులు హరిగిరి.ఆసక్తి కలవారు ఎంట్రీ ఫీజు 30 వ తేదీ లోపు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని గ్రామ పెద్దలు తెలిపారు.శ్రీశ్రీశ్రీ కాసిం స్వామి ఉరుసు మహోత్సవానికి ప్రజలు అందరూ తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని గ్రామస్తులు తెలియజేశారు.

Related Posts