YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి రద్దుకు శాసనసభ ఆమోదం

మండలి రద్దుకు శాసనసభ ఆమోదం

మండలి రద్దుకు శాసనసభ ఆమోదం
133 సభ్యుల యేస్… నో వ్యతిరేకం
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం  సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించగా, సభలో ఉన్న అందరూ లేచి నిలబడ్డారు. అసెంబ్లీ సిబ్బంది లెక్కించగా 133 మంది లెక్క తేలింది. వారందరూ మండలి రద్దుకు అనుకూలమని తేల్చారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది. తీర్మానం సమయానికి తటస్థ ఓట్లు, వ్యతిరేక ఓట్లు పడలేదు. విపక్ష టీడీపీ సభ్యులందరూ హజరు కాలేదు. 18 మంది వైకాపా సభ్యులు కుడా సభకు హజరుకాలేదు. జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ మాత్రం ఆదే సమయానికి బయటకు వెళ్లిపోయారు. అయితే అయన తీర్మానానికి అనుకూలంగా ఓటేసారు. ఒక ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.  పార్లమెంట్, రాష్ట్రపతిల అమోదం లభిస్తే ఏపీ శాసనమండలి రద్దుయినట్లే. ఓటింగ్ ప్రక్రియ అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.

Related Posts