YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చేతల్లో మొండిచేయి చూపారు.. 

Highlights

  • నిధులపై వివరణ ఇచ్చిన సీఎం 
  • అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు 
చేతల్లో మొండిచేయి చూపారు.. 

అమరావతిలో  ఢిల్లీ కంటే అత్యుత్తమ రాజధాని కడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మాటిచ్చి చేతల్లో మొండిచేయి చూపించారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అమరావతిలో  అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులకు ఆయన పోలవరం నిర్మాణం, నిధులపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చారు. మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్నారని చెప్పారు.  ‘‘పోలవరానికి రూ.58 వేల కోట్లతో ఎస్టిమేషన్ వేసి డీపీఆర్-2 ఇచ్చామని చెప్పారు. రూ.16,000 కోట్లు పోగా, ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి రూ.42 వేల కోట్లు కావాలన్నారు. అందులో మొత్తం లెక్కవేస్తే రూ.58 వేల కోట్లలో, రూ.4వేల కోట్ల విలువైన పవర్ ప్లాంట్ వస్తోందని చెప్పారు.  భూసేకరణ, పునరావాసానికి రూ.33 వేల కోట్లు అవుతుందన్నారు.కాఫర్ డ్యామ్ పూర్తయితే ఈ సంవత్సరమే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూ కేటాయింపులు మినహా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిందన్నారు. ఇప్పటికీ అవి కొన్ని వేరే రాష్ట్రాలలో నిర్వహించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ.3,500 కోట్ల రూపాయిలు డిఫర్ ట్యాక్స్ ఈ రాష్ట్రానికి కట్టాల్సిన సంస్థలు ఇప్పటికీ హైదరాబాద్‌లో కట్టే పరిస్థితి  ఉందన్నారు.మెట్రో విషయంలో పాలసీ మార్చారు. మెట్రో ఇక్కడ కాదన్నారు. 
లైట్ మెట్రో ఇద్దామని చెప్పారు. వేరే రాష్ట్రాలకు మాత్రం ఇలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉదారంగా ఇస్తూ మన విషయానికి వచ్చేసరికి ఇలా పాలసీ మార్చేస్తున్నారు. డిస్కమ్ సంస్థల పవర్ డ్యూస్ తెలంగాణానుంచి అడ్జెస్టు చేయిస్తామని చెప్పారు. ఇంతవరకు తేల్చలేదు. 9, 10 షెడ్యూల్ వివాదాలను పరిష్కరించలేదంటూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు సమావేశంలో వివరించారు.  

Related Posts